- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rakul: ‘జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఇలాగే అనిపిస్తుంది’: టాలీవుడ్ హీరోయిన్
గిల్లి (Gilly) అనే కన్నడ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).

దిశ, వెబ్‌డెస్క్: గిల్లి (Gilly) అనే కన్నడ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఈ బ్యూటీ తర్వాత కెరటం, తడయ్యర తాక్క చిత్రాల్లో అవకాశం కొట్టేసి.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (Venkatadri Express) మూవీతో తెలుగులోకి అడుగు పెట్టింది. తొలి చిత్రంలోనే ఈ హీరోయిన్ ఉత్తమ నటిగా పేరు సంపాదించుకుంది.
అంతేకాకుండా సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ (South Filmfare Awards)లో నాలుగు నాలుగు నామినేషన్లలో నిలిచింది. తర్వాత అగ్ర హీరోల సరసన అవకాశాలు కొట్టేసింది. తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకుంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నాగార్జున (Nagarjuna), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global star Ram Charan), మాస్ మహారాజా రవితేజ వంటి సినిమాల్లో అవకాశం దక్కించుకుంది.
కెరటం, గిల్లి, పుతగం, యారియన్ (Yarian), యెన్నమో యెధో, లౌక్యం, పండగ చేస్కో, కరెంట్ తీగ (curreṇṭ thiga), కిక్-2, బ్రూస్ లీ, సరైనోడు, ధ్రువ, నాన్నకు ప్రేమతో, విజేత, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, స్పైడర్, అయ్యారీ, డెవ్, దే దే ప్యార్ దే, మన్మథుడు 2, మార్జావాన్, సిమ్లా మిర్చి, ఇండియన్ 2, మేరే హస్బెండ్ కీ బి వంటి సినిమాల్లో నటించి జనాల్ని మెప్పించింది.
ఇక ఈ అమ్మడు బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ(Jackie Bhagnani)ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దాదాపు వీరు నాలుగేండ్లు ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియా టాక్. తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదిక ఓ పోస్ట్ పెట్టింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాజాగా ‘‘సరదా, కుటుంబం, నవ్వు.. స్వచ్ఛమైన ఆనందం.. జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులతో చుట్టుముట్టబడినప్పుడు ఇలాగే అనిపిస్తుంది. ఫ్యామిలీ లవ్’’ అంటూ రకుల్ పోస్ట్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
READ MORE ...
Shriya Saran : కుర్రకారును కవ్విస్తున్న శ్రియా శరన్






