Rakul Preet Singh: అతడిని మిస్ అవుతున్నానంటూ.. టాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ పోస్ట్

by Kodari Anjali |

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌‌తో అభిమానుల్ని అలరిస్తుంటుంది.

Rakul Preet Singh: అతడిని మిస్ అవుతున్నానంటూ.. టాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌‌తో అభిమానుల్ని అలరిస్తుంటుంది. ఫ్యామిలీ అండ్ భర్తతో కలిసి గడిపిన క్షణాల్ని పంచుకుంటుంది. అలాగే ఎక్కువగా మోడ్రన్ డ్రెస్సులల్లో దర్శనమిచ్చి కుర్రాళ్లను ఫిదా చేస్తుంటుంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టింది. తన భర్తను మిస్ అవుతున్నట్లు పోస్ట్‌లో వెల్లడించింది. ‘‘చిత్రీకరణ టైంలో మా ఆయన్ను మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు జాకీ భగ్నానీకి దూరంగా ఉన్నాననే భావన ఉండేది.

కాగా ఆ ఫీలింగ్ రావొద్దని మా ఆయన స్వెట్ షర్ట్స్‌ను వేసుకున్నాను’’ అంటూ రకుల్ రాసుకొచ్చింది. ఓ సెల్ఫీ పిక్‌ను కూడా జోడించింది. ప్రస్తుతం జేబీ అనే పేరుతో భర్త పేరును సూచించే హుడీ వేసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ బ్యూటీ గతేడాది జాకీ భగ్నానీని (Jackie Bhagnani) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరి వార్షికోత్సవం కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం రకుల్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూ అటు ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. కానీ మొదట్లో వచ్చినన్నీ ఆఫర్లు రకుల్ ఇప్పుడు అందుకోవడం లేదని చెప్పుకోవచ్చు. కెరీర్ ప్రారంభంలో ఈ ముద్దుగుమ్మ అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుని తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది.

Next Story