- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చీకట్లో నక్షత్రంలా మెరుస్తున్న రకుల్.. కుర్ర హీరోయిన్లకు కష్టమే
చంకీలు పొదిగిన డ్రెస్ లో రాత్రిపూట మెరిసిపోతున్న రకుల్.

దిశ, వెబ్ డెస్క్ : మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే మంచి సక్సెస్ను, గుర్తింపును దక్కించుకుంది.
ఆ తర్వాత ఈ బ్యూటిఫుల్ భామ వరుస అవకాశాలను తెలుగు సినిమా పరిశ్రమలో అందిపుచ్చుకొని తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తూ కెరియర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే ఈమె తెలుగు సినిమాలకు స్వస్తి చెప్పేసింది.
రకుల్ ఆఖరుగా తెలుగులో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన కొండపొలంలో నటించింది. ఈ మూవీ విడుదలై ఇప్పటికే చాలాకాలం అవుతుంది. ఈ చిత్రం తర్వాత ఈమె ఏ తెలుగు సినిమాలో నటించలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎక్కువ శాతం తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది.
ఈమెకు ఈ రెండు ఇండస్ట్రీలలో కూడా భారీ విజయాలు మాత్రం ఈ మధ్యకాలంలో దక్కలేదు. అయినా కూడా ఈ చిన్నది ఆ రెండు భాషల సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోంది. సినిమాల్లో అనేక సందర్భాలలో హాట్ అందాలను ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులను అలరించిన ఈ నటి బయట కూడా అదే రీతిలో రెచ్చిపోతుంది.
తాజాగా రకుల్ చీకటి పూట చంకీలు పొదిగిన డ్రెస్ ను వేసుకొని తన నడుము, బ్యాక్ అండ్ ఫ్రంట్ అందాలు ప్రదర్శితమయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందులో ఈమె చీకటి పూట మెరిసిపోతుంది.






