Happy Valentine's Day: భర్తకు ముద్దు పెడుతూ ఫొటోలు పంచుకున్న అల్లు అర్జున్ బ్యూటీ

by Kodari Anjali |

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Happy Valentines Day: భర్తకు ముద్దు పెడుతూ ఫొటోలు పంచుకున్న అల్లు అర్జున్ బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఏకంగా అగ్ర హీరోల సరసన నటించి.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టార్ అండ్ హాట్, బ్యూటిఫుల్ హీరోయిన్లలో ఒకరైన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan)సరసన నటించి నెటిజన్ల మనసులో చెరగని ముద్ర వేసుకుంది.

అలాగే డైలాస్ కింగ్ సాయి కుమార్(King Sai Kumar) కుమారుడు ఆది సాయికుమార్ సరసన రఫ్ చిత్రంలో కూడా నటించి.. తన సత్తా చాటింది. మొదట్లో చిన్న కథానాయకులతో నటించినా.. తర్వాత సీనియర్ స్టార్ హీరోల సరసన అవకాశం సంపాదించుకుంది. ఈ బ్యూటీ ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నాగార్జున, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun), మాస్ మహారాజా రవితేజ, రామ్ రవితేజ వంటి సీనియర్ స్టార్ హీరోల సరసన అవకాశం దక్కించుకుని మరింత ఫేమ్ దక్కించుకుంది.

ఇకపోతే రకుల్ బాలీవుడ్ నిర్మాత అయిన జాకీ భగ్నానీ(Jackie Bhagnani)ని ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు నాలుగేళ్లు ప్రేమలో ఉండి.. వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు సోషల్ మీడియా టాక్. రకుల్ జాకీ గత ఏడాది ఫిబ్రవరి 21 వ తేదీన గోవా(Goa)లో సిక్కు.. ఆనంద్ కరాజ్ పద్ధతుల ద్వారా పెళ్లి ఇరు కుటుంబీకుల నడుమ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి సౌత్ గోవాలోని ఐటీసీ గ్రాండ్ హోటల్‌ లో గ్రాండ్ గా వీరి పెళ్లి జరిగింది. వీరి పెళ్లికి ఎందరో బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

అయితే నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ భర్తపై ప్రేమను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వ్యక్తపరిచింది. ‘హ్యాపీ వాలెంటైన్స్ డే మై ఫరెవర్ ఐ లవ్ యూ’ అని స్టోరీలో రాసుకొచ్చింది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ భర్తకు చెంపపై ముద్దు పెడుతోన్న ఓ ఫొటో కూడా పంచుకుంది.

Next Story