- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rakul Preet Singh: ‘రోజువారీ దినచర్యను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం’.. టాలీవుడ్ హీరోయిన్ పోస్ట్..?
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఏకంగా అగ్ర హీరోల సరసన నటించి.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టార్ అండ్ హాట్.. బ్యూటిఫుల్ హీరోయిన్లలో ఒకరైన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో వెంకటాద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ సరసన నటించి.. తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజా రవితేజ, సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వంటి సినిమాల్లో నటించింది. ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. డైలీ రొటీన్ బనావో అని క్యాప్షన్ రాసుకొచ్చింది. అలాగే రకుల్ ‘‘రోజువారీ దినచర్య.. మీరు ప్రతిరోజూ చేసే పనిని మార్చే వరకు మీరు మీ జీవితాన్ని ఎప్పటికీ మార్చలేరు.
మీ విజయ రహస్యం మీ దినచర్యలో కనుగొనబడుతుంది.. జాన్ సి. మాక్స్‌వెల్ ‘‘రోజువారీ దినచర్యను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం. మీరు అనుసరించే కొన్ని దినచర్యను కలిగి ఉండాలి. సరైన దినచర్య లేకుండా, మీరు మీ పనికి అనుగుణంగా ఉండలేరు. కొన్ని రోజులు, మీరు ప్రేరేపించబడతారు. బాగా పని చేస్తారు. మిగిలిన రోజుల్లో మీకు ప్రేరణ ఉండదు, మీరు వాయిదా వేయబోతున్నారు’’ అంటూ రాసి ఉన్న పోస్ట్ చేసింది.






