Rakshasa trailer : కూతురు క్షేమం కోసం తండ్రి ‘రాక్షస’.. భయంకరంగా వైరల్ అవుతున్న ట్రైలర్

by Chukka Sudharani |   (  Updated:2025-08-03 10:59:53  IST  )

కన్నడ హీరో ప్రజ్వల్ దేవ్‌రాజ్ (Prajwal Devraj) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రాక్షస’ (Rakshasa).

Rakshasa trailer : కూతురు క్షేమం కోసం తండ్రి ‘రాక్షస’.. భయంకరంగా వైరల్ అవుతున్న ట్రైలర్
X

దిశ, సినిమా: కన్నడ హీరో ప్రజ్వల్ దేవ్‌రాజ్ (Prajwal Devraj) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రాక్షస’ (Rakshasa). టైమ్ లూప్ కాన్సెప్ట్ (Time loop concept) హారర్ అండ్ థ్రిల్లర్ (Horror and thriller) మూవీగా తెరకెక్కిన ఈ మూవీకి లోహిత్ హెచ్ (Lohit H) దర్శకత్వం వహించాడు. కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ పతాకంపై ఎంవీఆర్ కృష్ణ ఈ కన్నడ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘రాక్షస’ నుంచి ట్రైలర్ (Trailer) రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఇందులో ప్రజ్వల్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను భయపెడుతూనే ఆకట్టుకుంటున్నాడు.

కూతురుపై ఉన్న ప్రేమతో ఈ సినిమాలో తండ్రి (హీరో) చేసిన సీన్స్ చిత్రంపై క్యూరియాసిటీ (Curiosity)ని పెంచేవిధంగా ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కానీ స్క్రీన్ ప్లేతో ఒక డిఫరెంట్‌ (Different)గా ట్రైలర్‌ను కట్ చేశారు చిత్ర బృందం. ముఖ్యంగా పోలీస్ స్టేషన్‌ (Police station)లో హీరో ఉండటం అతడికి కాపాడమంటూ ఫోన్లు రావడం.. కానీ మనుషులు కనిపించకుండా ఏదో శక్తి అతడిని ఇబ్బంది పెట్టడం ఆసక్తికరంగా నిలిచాయి. ప్రజెంట్ ఈ ట్రైలర్ నెట్టింట విశేషంగా వైరల్ అవుతోంది. కాగా.. కన్నడ, తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో ఫిబ్రవరి 26న ‘రాక్షస’ ప్రేక్షకుల ముందు రాబోతుంది.

Video Link..

Next Story