Rakhi Sawant : నాకు టీనేజ్ కుర్రోళ్లు నచ్చరు..

by Chukka Sudharani |   (  Updated:2026-04-23 15:53:13  IST  )

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాఖీ సావంత్.. తాజాగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Rakhi Sawant : నాకు టీనేజ్ కుర్రోళ్లు నచ్చరు..
X

దిశ, సినిమా: వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాఖీ సావంత్.. తాజాగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని భర్తలతో విడిపోయిన ఈ నటి.. మూడో పెళ్లిపై మాట్లాడుతూ గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రాపై సెటైరికల్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు ప్రియాంకా తనకంటే వయసులో చాలా చిన్నవాడైన నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నా వెంట కూడా టీనేజ్ కుర్రాళ్లు పడుతుంటారు. కానీ ఆ వయస్సు కుర్రాళ్లు నాకు నచ్చరు. కుర్రాడిని బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకోవడానికి నేనేమీ ప్రియాంకా చోప్రాని కాదు. అయితే.. ప్రియాంకా చోప్రా వయస్సు పెద్దగా కనిపించదు. ఆమె యువతిలా ఉంటుంది. అంతే కాదు చూడటానికి నిక్‌ జొనాస్‌ కంటే ఆమె చిన్నదానిలా కనిపిస్తుంది కాబట్టి ప్రాబ్లెమ్ లేదు’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది రాఖీ సావంత్. ప్రజెంట్ ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ పలు చర్చలకు దారితీస్తుంది

Read more... ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచిన బ్యూటీ.. అసలు కారణం ఇదేనా

Next Story