- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సంస్థ చేతికి రాకాస తెలుగు థియేట్రికల్ హక్కులు
రాకాస మూవీ యొక్క తెలుగు థియేట్రికల్ హక్కులను శ్రీ లక్ష్మీనరసింహ మూవీ మేకర్స్ సంస్థ దక్కించుకుంది.

దిశ, వెబ్ డెస్క్: మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న సంగీత్ శోభన్ తాజాగా రాకాస అనే చిత్రంలో హీరోగా నటించాడు. జీ స్టూడియోస్ సమర్పణలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల మరియు ఉమేష్ కుమార్ బన్సాల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. నయన్ సారిక ఇందులో హీరోయిన్గా నటించగా, మానస శర్మ దర్శకత్వం వహించారు.
హర్రర్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు థియేట్రికల్ హక్కులను అమ్మివేసింది. ఈ మూవీ యొక్క తెలుగు థియేట్రికల్ హక్కులను శ్రీ లక్ష్మీనరసింహ మూవీ మేకర్స్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు.
ఈ మధ్యకాలంలో హార్రర్ కామెడీ సినిమాలు చాలానే వస్తున్నాయి. కానీ అందులో చాలా తక్కువ మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సంగీత్ శోభన్ ఇందులో హీరోగా నటించడం, కమిటీ కుర్రాళ్ళు లాంటి హిట్ తర్వాత నిహారిక నిర్మించిన సినిమా కావడం, ఈ చిత్ర టీజర్ కూడా బాగుండడంతో ఈ మూవీపై ప్రేక్షకులు కాస్త మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ జనాలను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.






