సెన్సార్ పూర్తి చేసుకున్న 'రాకాస'

by Pulgam srinivas |

రాకాస చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు ‘U/A’ సర్టిఫికేట్ మంజూరు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న రాకాస
X

దిశ, వెబ్ డెస్క్: సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న హర్రర్ కామెడీ చిత్రం ‘రాకాస’ ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్ మంజూరు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది. మానస శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, రోహిణి, అనూప్ సింగ్, వాసు ఇంటూరి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.




Next Story