స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథ.. ఆకట్టుకుంటోన్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ ట్రైలర్

by Chukka Sudharani |

‘విరాట పర్వం’ ఫేమ్ దర్శకుడు వేణు ఉడుగుల నిర్మాతగా.. తన సొంత ప్రొడక్షన్ హౌస్‌లో చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజు వెడ్స్ రాంబాయి’.

స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథ.. ఆకట్టుకుంటోన్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ ట్రైలర్
X

దిశ, సినిమా: ‘విరాట పర్వం’ ఫేమ్ దర్శకుడు వేణు ఉడుగుల నిర్మాతగా.. తన సొంత ప్రొడక్షన్ హౌస్‌లో చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజు వెడ్స్ రాంబాయి’. 15 ఏళ్ళ క్రితం వరంగల్-ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజమైన ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ గమనించినట్లయితే.. ఎలాంటి కల్మషం లేని ఇద్దరు ప్రేమికుల కథగా ఇది తెలుస్తుంది. సున్నితమైన హాస్యం, మనసును తడిపే ప్రేమ, ఆలోచింపజేసే మాటలు, గుర్తుండిపోయే పాత్రలతో ట్రైలర్ అంతా ఆసక్తికరంగా సాగింది.

ట్రైలర్‌లోనే దాదాపు కథ మొత్తం చెప్పారు దర్శక నిర్మాతలు. చాలా సున్నితమైన కథాంశాన్ని ఇందులో చూపించబోతున్నట్లు ట్రైలర్‌తోనే హింట్ ఇచ్చేశారు దర్శక. ఇక క్లైమాక్స్ అయితే గుండెలకు హత్తుకునేలా ఉండబోతుందని తెలుస్తుంది. కాగా.. సాయిలు కంపాటి దర్శకత్వంలో అఖిల్, తేజస్వి రావ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దోలముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్స్ టేల్స్ బ్యానర్లపై రాహుల్ మోపిదేవి నిర్మించారు. శివాజీ రాజ, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ నవంబర్‌ 21న విడుదల కాబోతుంది.

Next Story