- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Raju Weds Rambai: బంపర్ ఆఫర్.. సినిమా టికెట్ ధర రూ.99 మాత్రమే
అఖిల్ రాజ్, తేజస్వి రావు ( Tejaswi Rao) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి ( Raju Weds Rambai)

దిశ, వెబ్ డెస్క్: అఖిల్ రాజ్, తేజస్వి రావు ( Tejaswi Rao) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి ( Raju Weds Rambai). ఓ పల్లెటూరిలో జరిగిన రియల్ లవ్ స్టోరీని దర్శకుడు సాయిల్ కంపాటి చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. డాక్టర్ నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మాణంలో ఈ సినిమా వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ మంచి హైప్ తీసుకువచ్చాయి. ఇక నవంబర్ 21వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ కీలక ప్రకటన చేసింది.
తమ సంస్థలో వస్తున్న రాజు వెడ్స్ రాంబాయి సినిమా టికెట్ ధరను రూ.99 గా నిర్ణయించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఈ ధర అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది. మల్టీప్లెక్స్ థియేటర్స్ లో రూ.105 గా టికెట్ ధర నిర్ణయించినట్లు ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ వెల్లడించారు. హైదరాబాద్ లో తాజాగా రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా సాయికృష్ణ ప్రకటన చేశారు. పైరసీని అరికట్టేందుకు మొదటి నుంచి ఈటీవీ విన్ పోరాటం చేస్తోందని తెలిపారు. అందుకే జనాలందరూ పైరసీ మానేసి, థియేటర్ కు వెళ్లేందుకు సినిమా టికెట్ల ధరలు తగ్గించినట్లు స్పష్టం చేశారు. క్లిక్






