ఎన్టీఆర్ కోసం 7 క‌థ‌లు రెడీ ? ఆ ద‌ర్శ‌కుడి ప్లాన్ అదుర్స్

by velandi.Saikiran |

దర్శకుడు సాయిలు కంపాటి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఈవెంట్ లో పాల్గొన్న సాయిలు కంపాటి, జూనియర్ ఎన్టీఆర్ కోసం

ఎన్టీఆర్ కోసం 7 క‌థ‌లు రెడీ ? ఆ ద‌ర్శ‌కుడి ప్లాన్ అదుర్స్
X

దిశ‌, వెబ్‌డెస్క్‌: ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రభంజనం సృష్టించిన తాజా సినిమా రాజు వెడ్స్ రాంబాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం సరిహద్దు ప్రాంతంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను చాలా గ్రాండ్ గా దర్శకుడు సాయిలు కంపాటి ( Director Saailu Kampati ) తెరకెక్కించారు. నవంబర్ 21వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. వేణు ఊడుగుల నిర్మాతగా వచ్చిన ఈ సినిమాలో హీరోగా అఖిల్, హీరోయిన్ గా తేజస్వీ రావు నటించారు. విలన్ పాత్రలో చైతు జొన్నలగడ్డ జీవించి పోయారు. వీళ్ళందరూ కొత్త నటులు అయినప్పటికీ సినిమాలో కథ బాగుండడంతో జనాలకు బాగా ఎక్కింది.

దీంతో సినిమా సక్సెస్ బాట పట్టింది. అయితే ఈ సినిమా కొత్త దర్శకుడు సాయిలు కంపాటి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఈవెంట్ లో పాల్గొన్న సాయిలు కంపాటి, జూనియర్ ఎన్టీఆర్ కోసం మొత్తం ఏడు కథలు రాసుకున్నట్లు పేర్కొన్నారు. మొదటి నుంచి తాను జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని అంటూ వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ ఓకే చెబితే, ఈ ఏడు కథలు ఆయనకు వినిపిస్తానని స్పష్టం చేశారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కు నచ్చిన సినిమా తీస్తానని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కానీ అంత పెద్ద హీరో తనకు అవకాశం ఇస్తాడా ? అనే టెన్షన్ కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో సాయిలు కంపాటి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Next Story