ఐటెమ్ గర్ల్‌గా మారిపోయిన సాఫ్ట్ హీరోయిన్.. షాకింగ్ వీడియో వైరల్

by Sujitha Rachapalli |

రజిషా విజయన్ అంటే నేచురల్, గర్ల్ నెక్స్డ్ డోర్ రోల్స్ గుర్తుకువస్తాయి. కానీ వీటిని బ్రేక్ చేస్తూ తొలిసారి హాట్ అప్పియరెన్స్ ఇచ్చింది. స్పెషల్ సాంగ్‌తో అందరికీ షాక్ ఇచ్చింది.

ఐటెమ్ గర్ల్‌గా మారిపోయిన సాఫ్ట్ హీరోయిన్.. షాకింగ్ వీడియో వైరల్
X

దిశ, సినిమా : రజిషా విజయన్ అంటే నేచురల్, గర్ల్ నెక్స్డ్ డోర్ రోల్స్ గుర్తుకువస్తాయి. కానీ వీటిని బ్రేక్ చేస్తూ తొలిసారి హాట్ అప్పియరెన్స్ ఇచ్చింది. స్పెషల్ సాంగ్‌తో అందరికీ షాక్ ఇచ్చింది. అవును.. సైన్స్ ఫిక్షన్ కామెడీ ఫిల్మ్ మస్తిష్క మరణం మూవీలో ‘కోమల తామర’ పాటకు బోల్డ్ అవతార్‌లో స్టెప్పులు వేసింది. సాంగ్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. రెడ్ సారీలో గ్లామరస్ లుక్, కిల్లర్ మూవ్స్, కాన్ఫిడెన్స్ అండ్ ఫైర్‌తో అదరగొట్టేసింది. ఈ పాటను వర్కే కంపోజ్ చేయగా.. ప్రణవం శశి పాడాడు. కొరియోగ్రఫీ డ్యాన్సింగ్ నింజా టీమ్ చేసింది. మొత్తానికి సీనియర్ యాక్టర్స్, అభిమానులు ఆమె వెర్సటిలిటీ, బోల్డ్ లుక్‌కు ఫిదా అయిపోయారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మలయాళ విద్యా బాలన్’ అంటూ పొగిడేస్తున్నారు.

LINK

Next Story