- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Coolie : రజినీకాంత్ 'కూలీ' రిలీజ్ డేట్ ప్రకటన
సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ డిక్లేర్ అయింది.

దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ డిక్లేర్ అయింది. రజినీకాంత్, లోకేష్ కనగరాజ్(Lokesh KanagaRaj) డైరెక్షన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ "కూలీ"(Coolie). ఈ మూవీ ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్(Sun Picturs) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రజినీకాంత్ గోల్డ్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. చిత్రంలో అక్కినేని నాగార్జున(Nagarjuna), ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు.
గత మార్చి14న లోకేష్ కనగరాజ్ పుట్టినరోజు సందర్భంగా కూలీ టీజర్ విడుదల కాగా.. ఈ టీజర్ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. అయితే, ఈ చిత్రం విడుదల రోజే ఎన్టీఆర్(Jr NTR), హృతిక్ రోషన్(Hrutik Roshan) నటించిన 'వార్ 2'(War-2)తో కూడా రిలీజ్ కానుండటం వలన బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలకు గట్టి పోటీ ఉండనుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈ ప్రకటన వెలువడిన తరువాత తలైవా ఫ్యాన్స్ మాత్రం "కూలీ" ఫీవర్ లో పడిపోయి, సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త ట్రెండింగ్ లో ఉంది.






