- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రజినీకాంత్‌కు హ్యాండ్ ఇచ్చిన కమల్ హాసన్ ?
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ‘జైలర్ 2’ మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే ఆ తర్వాత ప్రాజెక్ట్ #Thalaivar173.. రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కమల్ హాసన్ ప్రొడ్యూసర్‌గా ఉంటుందని ప్రకటించారు. దీనికి సుందర్ సి దర్శకత్వం వహిస్తారని అధికారికంగా అనౌన్స్ చేశారు.

దిశ, సినిమా : సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ‘జైలర్ 2’ మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే ఆ తర్వాత ప్రాజెక్ట్ #Thalaivar173.. రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కమల్ హాసన్ ప్రొడ్యూసర్‌గా ఉంటుందని ప్రకటించారు. దీనికి సుందర్ సి దర్శకత్వం వహిస్తారని అధికారికంగా అనౌన్స్ చేశారు. కానీ సుందర్ సి అనూహ్య కారణాల వల్ల వైదొలిగారు. అయితే కమల్ కూడా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు సుముఖంగా లేడని.. తప్పుకున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ తాజాగా దర్శకుడు మాత్రమే మారాడని కోలీవుడ్ టాక్. నేషనల్ అవార్డ్ విన్నర్, పార్కింగ్ మూవీ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ తలైవర్ తర్వాతి ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఫీల్-గుడ్ కమర్షియల్ స్టోరీ చెప్పగా.. సూపర్ ఇంప్రెస్ అయ్యారని తెలుస్తోంది. జనవరి 10లోపు అనౌన్స్‌మెంట్ కూడా రావచ్చనేది టాక్. కాగా మరోవైపు RKFI కాకుండా వేరే బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుందనే బజ్ కూడా ఉంది. దీంతో తలైవా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమల్, రజినీకి హ్యాండ్ ఇచ్చాడని ఫైర్ అవుతున్నారు.






