అచ్చం రజినీకాంత్‌ లాగానే ఉన్న మనవడు.. ఫొటోలు వైరల్

by Sujitha Rachapalli |

సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులచే తలైవాగా కీర్తించబడుతున్నాడు. దేవుడిగా కొలవబడుతున్నాడు. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో వారసుడు రావాలని కోరుకుంటారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ఆ వారసుడిని ట్రెండ్ చేస్తున్నారు. అతను

అచ్చం రజినీకాంత్‌ లాగానే ఉన్న మనవడు.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా : సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులచే తలైవాగా కీర్తించబడుతున్నాడు. దేవుడిగా కొలవబడుతున్నాడు. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో వారసుడు రావాలని కోరుకుంటారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ఆ వారసుడిని ట్రెండ్ చేస్తున్నారు. అతను మరెవరో కాదు ఆయన మనవడే. ధనుష్, ఐశ్వర్యా రజనీకాంత్ సంతానం అయిన యాత్రా రాజా అచ్చం తలైవా పోలికలు కలిగి ఉండటంతో వైరల్ అవుతున్నాడు. ఇద్దరినీ పోలుస్తూ ఫొటోలను ట్రెండ్ చేస్తున్నారు. 2006 అక్టోబర్ 10న పుట్టిన యాత్రా రాజాకు 19 ఏళ్లు కాగా ఈ మధ్యే గ్రాడ్యుయేషన పూర్తి చేశాడు. తన తండ్రి ధనుష్ సినిమాకు సంబంధించిన ఓ పాటకు లిరిక్స్ కూడా అందించినట్లు తెలుస్తోంది. త్వరలో స్క్రీన్‌పై కూడా మెరవబోతుండగా.. నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్ అతనేనని ప్రశంసిస్తున్నారు.

Next Story