- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఖండ -2 ఎఫెక్ట్.. రజనీకాంత్ రీరిలీజ్ సినిమా కూడా వాయిదా
డిసెంబర్ 5న విడుదల కావలసిన అఖండ-2 పోస్ట్ పోన్ అవ్వడం, డిసెంబర్ 12న సినిమా ప్రపంచవ్యాప్తంగా..

దిశ, వెబ్‌డెస్క్: డిసెంబర్ 5న విడుదల కావలసిన అఖండ-2 పోస్ట్ పోన్ అవ్వడం, డిసెంబర్ 12న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండటంతో చాలా సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. ఈ లిస్టులో రజనీకాంత్ రీరిలీజ్ సినిమా కూడా ఉంది. రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న శివాజీ సినిమాను రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ రీరిలీజ్ ను వాయిదా వేసుకున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో తలైవా ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు.
సినీ మార్కట్లో అఖండ-2 హవా నడుస్తోందని చెప్పాలి. భారీ అంచనాల నడుమ సినిమా ప్రీమియర్స్ 11వ తేదీ రాత్రి వెండితెరపై పడనున్నాయి. మరికొద్దిగంటల్లో అఖండ-2 సినిమా ఎలా ఉందన్నదీ తెలిసిపోతుంది. అభిమానుల నిరీక్షణకు ఈ సినిమా వర్త్ అనిపించేలా ఉంటుందా లేదా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇక పెయిడ్ ప్రీమియర్స్ తో పాటు, రెగ్యులర్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో గంటగంటకూ అఖండ-2 తాండవం క్రేజ్ పెరుగుతోంది. గంటకు 18.5k టికెట్లు బుక్కవుతుండటంతో సినిమాపై ఉన్న క్రేజ్ కి నిలువెత్తు నిదర్శనమని చెప్పాలి. కేవలం అభిమానులే కాదు.. మూవీ లవర్స్ కూడా సినిమా ఫస్ట్ డే చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.






