పార్టీ పెడితే పక్కా గెలిచేవాన్ని, స్టాలిన్ నా ఫ్రెండ్.. రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-17 05:36:33  IST  )

సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ సీఎం అయితే అసూయపడతానని అన్నారు. విజయ్ తనకు సమవుజ్జీ కాదని అన్నారు. విజయ్‌కి తనకు 25 ఏళ్లు తేడా ఉందని వ్యాఖ్యానించారు.

పార్టీ పెడితే పక్కా గెలిచేవాన్ని, స్టాలిన్ నా ఫ్రెండ్.. రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ సీఎం అయితే అసూయపడతానని అన్నారు. విజయ్ తనకు సమవుజ్జీ కాదని అన్నారు. విజయ్‌కి తనకు 25 ఏళ్లు తేడా ఉందని వ్యాఖ్యానించారు. తాను పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాడినని అన్నారు. మాజీ సీఎం స్టాలిన్ తనకు మంచి స్నేహితుడు అని అందుకే ఓడిన తరవాత వెళ్లి కలిశానని అన్నారు. విజయ్ సీఎం కాకుండా తాను అడ్డుకోలేదని స్పష్టం చేశారు. అలాంటి నీచ రాజకీయాలు తాను చేయనని రజినీ స్పష్టం చేశారు. అసలు రాజకీయాలతోనే తనకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకే విజయ్ ని గెలిపించారని అన్నారు.

ఇదిలా ఉంటే తమిళనాడులో విజయ్ సీఎం అవ్వడంతో రజినీకాంత్ అసూయపడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అందుకే విజయ్ గెలిచిన తరవాత అతడు సీఎం అవ్వకుండా అడ్డుకునేందుకు మాజీ సీఎం స్టాలిన్ ను కలిశాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రచారంపై స్పందించిన రజినీకాంత్ క్లారిటీ ఇచ్చారు. ఇక రజినీకాంత్ గతంలో పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పార్టీపై అధికారిక ప్రకటన కూడా చేశారు. రజినీ పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం జరగటంతో ప్రజల నుండి కూడా ఆయనకు మద్దతు లభించింది. ఇంతలో ఏం జరిగిందో కానీ రజినీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆరోగ్య సమస్యలు వచ్చాయని చెబుతూ పార్టీ ప్రకటనపై వెనక్కితగ్గారు. ఇక ఇటీవల విజయ్ గెలుపుతో రజినీ పేరు తమిళనాట పెద్ద ఎత్తున చర్చగా మారడంతో ఆయన స్పందించాల్సి వచ్చింది.

Next Story