ప్రతి ఇంట్లో జరిగే కథ ఇది.. సీనియర్ హీరో ఆసక్తికర కామెంట్స్

by Chukka Sudharani |

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajedra Prasad) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’(Shastipoorthi).

ప్రతి ఇంట్లో జరిగే కథ ఇది.. సీనియర్ హీరో ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajedra Prasad) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’(Shastipoorthi). పవన్ ప్రభ (Pawan Prabha) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్చన(Archana), రూపేశ్(Roopesh), ఆకాంక్ష సింగ్ (Akanksha Singh) ప్రధాన పాత్రలను పోషించారు. ఈ మూవీ మే 30న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో బుధవారం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ‘48 ఏళ్ల నుంచి నన్ను ఆదరిస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు థాంక్స్. నాకు ఎప్పుడూ మంచి పాత్రలే వస్తున్నాయి.

నా వయసుకు తగ్గ పాత్రలే వస్తుండటం నా అదృష్టం. ‘షష్టిపూర్తి’ గొప్ప చిత్రం అవుతుందని ఈ రోజు నా గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నా. నేను ఎంతో సంతృప్తిగా ఫీల్ అయిన చిత్రమిది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఇది ప్రతి ఇంట్లో జరిగే కథ అని అందరికీ అర్థం అవుతుంది. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. తెలుగు వారిని ప్రతిబింబించేలా ఈ మూవీ ఉంటుంది. ‘షష్టిపూర్తి’ చిత్రంలో అన్ని రకాల అంశాలుంటాయి. నవ్విస్తాను, ఏడ్పిస్తాను. ఈ మూవీని చూసిన తరువాత ప్రతీ ఒక్కరూ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వారిని ప్రేమగా పలకరిస్తారు. ఈ సినిమా కచ్చితంగా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పుకొచ్చారు.

Next Story