- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rajendra Prasad Controversy : రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు... అలీ రియాక్షన్ ఇదే
తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ నటుడిగా, కామెడీ కింగ్‌గా పేరొందిన రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) ప్రతిసారి ఏదోక వివాదంలో ఇరుక్కుంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ నటుడిగా, కామెడీ కింగ్‌గా పేరొందిన రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) ప్రతిసారి ఏదోక వివాదంలో ఇరుక్కుంటున్నారు. తాజాగా ఇటీవల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి(SV Krishna Reddy) జన్మదిన వేడుకల్లో కమెడియన్ అలీ(Ali)పై అనుచిత వ్యాఖ్యలు అటు ఇండస్ట్రీలో ఇటు నెట్టింట్లో తీవ్ర దుమారం రేపాయి. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై కమెడియన్ అలీ స్పందించారు.
"నిన్న కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ఏదో మాట తూలి సరదాగా అన్నారు. దానిని తీసుకుని మీడియా మిత్రులు వైరల్ చేస్తున్నారు. ఆయన మంచి ఆర్టిస్ట్, ఆయన దుఃఖంలో ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆయనకు అమ్మ లాంటి కూతురు చనిపోయింది. అంత దుఖంలో ఉన్న ఆ పెద్దాయనను ఏమీ అనవద్దు. దయచేసి ఇక ఈ విషయంలో రచ్చ చేయకండి" అని అన్నారు.






