కమెడియన్ అలీని బండ బూతులు తిట్టిన రాజేంద్రప్రసాద్!

by velandi.Saikiran |   (  Updated:2025-06-13 12:59:34  IST  )

కమెడియన్ అలీని బండ బూతులు తిట్టిన రాజేంద్రప్రసాద్!
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన తోటి నటుడిని కించపరుస్తూ మాట్లాడి... మరో వివాదానికి తెర లేపారు. కమెడియన్ అలీపై... నోరు పారేసుకుని.. అడ్డంగా దొరికిపోయారు నటుడు రాజేంద్రప్రసాద్. తాజాగా దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి (S. V. Krishna Reddy) జన్మదిన వేడుకలు జరిగాయి.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు, నటి నటులు చాలామంది హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేజి పైకి వెళ్లి నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే కమెడియన్ అలీని (Ali) ఉద్దేశించి ల**** భాష వాడుతూ బండ బూతులు తిట్టారు. దీంతో క్షణాల్లోనే.. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో నటుడు రాజేంద్రప్రసాద్ పై ఫైర్ అవుతున్నారు సినీ ప్రియులు.

నటుడిగా మంచి స్థానంలో ఉన్న రాజేంద్రప్రసాద్... రోజు రోజుకు దిగజారిపోతున్నాడని ఫైర్ అవుతున్నారు. ఆలీతో మంచి సంబంధం ఉంటే... ఎక్కడైనా కూర్చున్నప్పుడు లేదా ఫోన్ లో ఏ భాషలో తిట్టుకున్న పర్లేదు కానీ... అందరి ముందు ఒక కార్యక్రమంలో ఇలా మాట్లాడడం సమంజసం కాదని చురకలనిపిస్తున్నారు పలుగురు నెటిజెన్స్. గతంలో కూడా డేవిడ్ వార్నర్ పైన ఇలాగే అనుచిత వ్యాఖ్యలు చేసి అడ్డంగా దొరికిపోయాడు రాజేంద్రప్రసాద్. ఈ సంఘటన ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఇది మరువక ముందే మళ్లీ రాజేంద్రప్రసాద్ ఇలా మాట్లాడారు.

Next Story