‘స:కుటుంబానాం’ విజయంపై రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్

by Sujitha Rachapalli |

హెచ్‌ఎన్‌జి సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించిన చిత్రం ‘స:కుటుంబానాం’. ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ కిరణ్, మేఘ ఆకాష్ హీరోహీరోయిన్లు

‘స:కుటుంబానాం’ విజయంపై రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్
X

దిశ, సినిమా : హెచ్‌ఎన్‌జి సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించిన చిత్రం ‘స:కుటుంబానాం’. ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ కిరణ్, మేఘ ఆకాష్ హీరోహీరోయిన్లు కాగా నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్ కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించిన సినిమా జనవరి 1న విడుదలై ప్రేక్షకాదరణ పొందగా.. చిత్ర బృందం సక్సెస్ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ... ‘నా తెలుగు ప్రేక్షకులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 48 సంవత్సరాలుగా అందరికీ ఒక కుటుంబ సభ్యుడిలా ఉన్నాను. స:కుటుంబానాం చిత్రాన్ని హిట్ చేశారు. ఇటువంటి మంచి కథలతో మరెన్నో సినిమాలు దర్శకులు, నిర్మాతలు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థియేటర్లు పెరుగుతున్నాయి అంటే సినిమా ఎంత విజయం సాధించిందో అర్థం అవుతుంది. ప్రేక్షకులు ఈ సినిమాకు మరింత సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.

Next Story