- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rajamouli: రాజమౌళిపై రాజీవ్ కనకాల షాకింగ్ కామెంట్స్.. నెట్టింట వీడియో వైరల్
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాజీవ్ కనకాల (Rajiv Kanakala) ఒకరు.

దిశ, సినిమా: తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాజీవ్ కనకాల (Rajiv Kanakala) ఒకరు. చిన్న హీరో, పెద్ద హీరో అనే సంబంధం లేకుండా.. ప్రతి సినిమాలో కనిపిస్తూ ఉంటాడు. ఇక ఈయన రాజమౌళి (Rajamouli) డైరెక్షన్‌లో చేసిన చిత్రాల్లో ‘విక్రమార్కుడు’ (Vikramarkudu) ఒకటి. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాతో రాజీవ్ కనకాల క్రేజ్ కూడా మరింత పెరిగింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ కనకాల స్టార్ డైరెక్టర్ రాజమౌళిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (Interesting comments) చేశాడు.
‘2000లో నేను సిల్వర్ స్క్రీన్(Silver screen)కు వచ్చేసరికి రాజమౌళి ఉన్నారు. తనకు కవాల్సినది వచ్చేంత వరకు ఆ నటుడు చచ్చాడే. అంటే పచ్చిచేపని బండకేసి పులస తీసీనట్టు.. యాక్టింగ్ మొత్తం తీస్తాడు. ఆడు సాయంత్రానికి నేను ఎందుకు ఇక్కడ పడ్డానురా అయ్యా ఇతను దగ్గర అని అనుకునే లెవల్‌లో చేస్తాడు. కానీ, ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత అరేయ్ ఇతని దగ్గర పడకపోయి ఉంటే నా జీవితం ఏం అయిపోయేది.. అని సినిమా రిలీజ్ తర్వాత ప్రతి హీరో (hero), ప్రతి విలన్ (villain) కచ్చితంగా అనుకుంటారు. నాకు తెలిసి చాలా మంది ఆయన ఫొటోలు కూడా ఇంట్లో పెట్టుకుని ఉంటారు. ఆయన ఏది అయితే కవాలి అనుకుంటాడో అది వచ్చే వరకు విడిచి పెట్టాడు.. వివరిస్తూనే ఉంటారు. అయినా కూడా యాక్ట్ చెయ్యలేకపోతే రాజమౌళినే వెళ్లి యాక్ట్ చేసి చూపిస్తారు. అంత గొప్పోడు రాజమౌళి’ అంటూ చెప్పుకొచ్చాడు.






