- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రాగన్‌లో రాజీవ్ కనకాల.. ఆ తేదీ నుంచి షూటింగ్‌లో కూడా జాయిన్ కానున్నాడు
రాజీవ్ కనకాల తాజాగా తారక్ హీరోగా నటిస్తున్న 'డ్రాగన్' మూవీలో నటిస్తున్నట్లు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి ఇప్పటివరకు టైటిల్‌ను అధికారికంగా ప్రకటించలేదు. కానీ 'డ్రాగన్' అనే టైటిల్‌ను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. రీసెంట్‌గా సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీని మే 8వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఈ మూవీ బృందం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. అందులో రాజీవ్ కనకాల కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఆయన, నేను తారక్ హీరోగా నటిస్తున్న 'డ్రాగన్' మూవీలో నటిస్తున్నట్లు చెప్పారు.
వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని మంచి విజయాలను అందుకున్నాయి. అలాంటి వీరి కాంబోలో మరో సినిమా రాబోతుంది అనగానే దానిపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా షూటింగ్లో మే 7వ తేదీ నుండి రాజీవ్ కనకాల జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. 'డ్రాగన్' చిత్రాన్ని వచ్చే సంవత్సరం జూన్ 11న విడుదల చేయనున్నట్లు మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీపై తారక్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.






