- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rajashekhar: నేను చేసిన ఆ ఒక్క మిస్టేక్ వల్ల ఠాగూర్ నా చేతి నుంచి జారిపోయింది
రమణ రీమేక్ విషయంలో నిర్మాతతో ధర మాట్లాడుకున్నాను కానీ అగ్రిమెంట్ మాత్రం చేసుకోలేదు. అదే ఆ సినిమా విషయంలో తాను చేసిన పెద్ద తప్పు అని రాజశేఖర్ తాజాగా చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: ఠాగూర్ చిత్రంలో చిరంజీవి హీరోగా నటించి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటగా రాజశేఖర్ చేయాల్సిందని, కొన్ని కారణాల వల్ల అది చిరంజీవికి వెళ్లిందని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై రాజశేఖర్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... తమిళంలో వచ్చిన రమణ సినిమా చూసిన తర్వాత అది తనకు చాలా నచ్చిందని తెలిపారు. దాంతో ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నానని, వెంటనే ఆ సినిమా నిర్మాతను కలిసి రేటు కూడా మాట్లాడుకున్నానని, అన్ని విషయాలు ఓకే అయ్యాయని తెలిపారు.
అయితే ఆ నిర్మాత తనకు స్నేహితుడు కావడంతో అగ్రిమెంట్ మాత్రం చేసుకోలేదని తెలిపారు. ఆ తర్వాత మధు, చిరంజీవితో ఠాగూర్ సినిమాను నిర్మించేందుకు అదే నిర్మాతను కలిసి, తాను చెప్పిన దానికంటే ఎక్కువ మొత్తాన్ని ఇస్తానని చెప్పారని, దాంతో ఆ నిర్మాత కూడా ఆ సినిమా హక్కులను మధుకు ఇవ్వడానికి ఒప్పుకున్నారని తెలిపారు. వెంటనే వారు అగ్రిమెంట్ చేసుకోవడంతో ఆ సినిమా రీమేక్ హక్కులు వారికి వెళ్లాయని చెప్పారు. “నేను మొదట అగ్రిమెంట్ చేసుకుని ఉండి ఉంటే ఆ సినిమాను తెలుగులో చేసే అవకాశం నాకు దక్కేది. నా స్నేహితుడు అనే నమ్మకంతో అగ్రిమెంట్ చేయకపోవడమే ఆ సినిమా విషయంలో నేను చేసిన పెద్ద తప్పు అని రాజశేఖర్ తాజాగా వెల్లడించారు.






