Rajashekhar: డాన్స్ అంటే చాలా భయం.. గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడిని

by Pulgam srinivas |

రాజశేఖర్ మాట్లాడుతూ… నా కెరీర్‌లో డ్యాన్స్ విషయంలో నేను చాలా కష్టపడ్డాను. కొన్ని సందర్భాల్లో గంటల తరబడి డ్యాన్స్ కోసం ప్రాక్టీస్ కూడా చేసేవాడిని అని చెప్పుకొచ్చాడు.

Rajashekhar: డాన్స్ అంటే చాలా భయం.. గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడిని
X

దిశ, వెబ్ డెస్క్: యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ తాజాగా శర్వానంద్ హీరోగా రూపొందిన ‘బైకర్’ చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. దాంతో ఈయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో తాను హీరోగా బిజీగా కొనసాగుతున్న సమయంలో ఏ విషయంలో ఎక్కువగా ఇబ్బంది పడ్డానో చెప్పుకొచ్చాడు. రాజశేఖర్ మాట్లాడుతూ... “నేను ఎన్నో సినిమాల్లో మాస్ పాత్రల్లో నటించాను. యాక్షన్ సన్నివేశాల్లో నటించడం నాకు చాలా ఈజీగా అనిపించేది.

ఎంత కష్టమైన యాక్షన్ బ్లాక్ అయినా చాలా సులువుగా చేసేవాడిని. కానీ డాన్స్ విషయానికి వస్తే మాత్రం నాకు చాలా భయం వేసేది. సాధారణంగానే నా బాడీలో రిథమ్ ఉండదు. దాంతో చిన్న చిన్న మూమెంట్స్ కూడా వేయడానికి చాలా ఇబ్బంది పడేవాడిని. కొన్ని సందర్భాల్లో డాన్స్ మాస్టర్లు నాకు ఒక స్టెప్ ఇస్తే, దానిని నేను గంటల తరబడి ప్రాక్టీస్ చేసి చేసేవాడిని. ఇక అలా ఎంతో కష్టపడి చేయడం వల్ల కొన్ని సంవత్సరాలకు డాన్స్ కాస్త ఈజీ అయ్యింది.

ఏదేమైనా నా కెరీర్‌లో డాన్స్ అనేది కాస్త కష్టంగానే ఉండేది” అని రాజశేఖర్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఇలా ఈ నటుడు తనకు డ్యాన్స్ రాదనే విషయాన్ని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పడంతో, చాలామంది రాజశేఖర్ చాలా గ్రేట్... ఉన్నది ఉన్నట్లుగా క్లియర్‌గా చెప్పారని ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈయన కీలక పాత్రలో నటించిన ‘బైకర్’ చిత్రం మంచి విజయం సాధిస్తే, రాజశేఖర్‌కు వరుసగా తెలుగు చిత్రాల్లో అవకాశాలు దక్కుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story