- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజశేఖర్ ఫిట్‌నెస్ సీక్రెట్: రోజూ ఈ ఫుడ్ తీసుకుంటాను
రాజశేఖర్ మాట్లాడుతూ, రోజువారి ఆహారంలో పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవడం, అలాగే తగిన వ్యాయామం చేయడం వల్ల తను ఈ వయసులో కూడా చాలా ఫిట్‌గా ఉన్నట్లు చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఈ మధ్యే తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. కొంత కాలం క్రితం నితిన్ హీరోగా రూపొందిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. తాజాగా శర్వానంద్ ప్రధాన పాత్రలో రూపొందిన బైకర్ చిత్రంలో ఈయన శర్వానంద్ కి తండ్రి పాత్రలో నటించాడు. ఈ మూవీలోని రాజశేఖర్ పాత్రకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రస్తుతం రాజశేఖర్ వయస్సు 64 సంవత్సరాలు, అయినా కూడా ఈ సీనియర్ నటుడు ఎంతో ఫిట్ గా, అందంగా కనబడుతున్నాడు.
దాంతో ఈయన ఎలాంటి డైట్ పాటిస్తాడు అని తెలుసుకోవాలి అనే ఉత్సాహం జనాల్లో బాగానే ఉంది. తాజాగా రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆయన రోజు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు అనేది క్లియర్గా చెప్పుకొచ్చాడు. రాజశేఖర్ మాట్లాడుతూ... నేను రోజు తీసుకునే ఆహారం విషయంలో ఎక్కువ శాతం పండ్ల రసాలకు ప్రాముఖ్యత ఇస్తాను. రోజులో వాటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటాను. కేవలం మంచి ఫుడ్ తీసుకోవడం మాత్రమే కాకుండా రోజులో కొన్ని గంటల పాటు వ్యాయామం కూడా చేస్తుంటాను. దాని ద్వారా కూడా మన శరీరం ఎంతో బాగుంటుందని, ఇలా మంచి డైట్, శరీరానికి తగిన ఎక్సర్సైజ్ రెండూ సమాన స్థాయిలో మెయింటెన్ చేయడం వల్లే తాను ఈ వయసులో కూడా అందంగా ఉన్నట్లు రాజశేఖర్ తాజాగా చెప్పుకొచ్చారు.






