- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijay Devekonda: యాంగ్రీ మ్యాన్ V/s రౌడీ హీరో.. విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్థన్’లో విలన్‌గా ఆ స్టార్ హీరో
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devekonda) నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘రౌడీ జనార్థన్’ (Rowdy Janardhan) ఒకటి.

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devekonda) నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘రౌడీ జనార్థన్’ (Rowdy Janardhan) ఒకటి. స్పై యాక్షన్ థ్రిల్లర్(Spy action thriller)గా తెరకెక్కతోన్న ఈ మూవీకి రవికిరణ్ కోలా (Ravikiran Kola) దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైనా కాన్సెప్ట్ పోస్టర్, సినిమా ప్రీ లుక్ పోస్టర్స్ సినిమాపై గుడ్ ఇంపాక్ట్‌ను క్రియేట్ చేశాయి. ‘కత్తి నేనే... నెత్తురు నేనే... యుద్ధం నాతోనే’ అంటూ పోస్ట్ చేసిన ఈ పోస్టర్‌తో ఈ సినిమా మరింత వైల్డ్‌గా ఉండబోతుందని తెలుస్తుంది.
ఈ చిత్రంలో హీరోకి ధీటుగా విలన్ క్యారెక్టర్ కూడా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇందులో విలన్‌గా నటించేందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంగ్రీ మ్యాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఒకప్పటి స్టార్ హీరో రాజశేఖర్(Rajasekhar)ను లైన్‌లో పెట్టినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా.. విలన్ క్యారెక్టర్ లుక్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు సంథింగ్ డిఫరెంట్ అనేలా డిజైన్ చేశారని ఫిలిమ్ వర్గాల నుంచి టాక్. ఈ సినిమాలో రాజశేఖర్ క్యారెక్టర్ 99.99 శాతం కన్ఫర్మ్. ఇక దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.






