Rajasekhar: బాలయ్యతో కలిసి నటించాలని ఉంది.. దర్శకుడు కూడా రెడీ

by Pulgam srinivas |

రాజశేఖర్ తాజాగా మాట్లాడుతూ... బాలకృష్ణతో సినిమా చేస్తే బాగుంటుందని నేను ప్రవీణ్ సత్తార్‌కు చెప్పాను. దాంతో ప్రవీణ్ ఓ కథను బాలయ్యకు వినిపించగా ఆయన కూడా ఓకే చెప్పారని రాజశేఖర్ వెల్లడించారు.

Rajasekhar: బాలయ్యతో కలిసి నటించాలని ఉంది.. దర్శకుడు కూడా రెడీ
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన రాజశేఖర్ తన కెరీర్ గురించి, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒకప్పుడు వరుస విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇటీవల కాలంలో హీరోగా చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే గరుడ వేగ చిత్రంతో మాత్రం మంచి కమ్‌బ్యాక్ అందుకున్నారు. ఇప్పుడేమో హీరో పాత్రలతో పాటు ఇతర ముఖ్యమైన పాత్రలపై కూడా ఆయన దృష్టి పెట్టారు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న “బైకర్” సినిమాలో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన “గరుడ వేగ” సినిమా గురించి వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చారు. ఆ సినిమా షూటింగ్ ఆలస్యమైందన్న ఆరోపణలను ఖండిస్తూ, కేవలం 93 రోజుల్లోనే పూర్తి చేశామని చెప్పారు. తనకు టైం సెన్స్ ఉందని, సినిమాల విషయంలో ఎంతో నిబద్ధతతో ఉంటానని స్పష్టం చేశారు. అలాగే గరుడ వేగ 2 పై కూడా అప్డేట్ ఇచ్చారు. దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ప్రస్తుతం ఆ సినిమా పనుల్లో ఉన్నారని తెలిపారు.

ఇదిలా ఉంటే, ఈ సీక్వెల్‌లో నందమూరి బాలకృష్ణ నటించనున్నారన్న వార్తలపై కూడా స్పందించారు. బాలకృష్ణతో ఒక సినిమా చేస్తే బాగుంటుందని తానే ప్రవీణ్ సత్తార్‌కు సూచించానని, దానికి అనుగుణంగా ఒక కథ కూడా సిద్ధం చేశారని చెప్పారు. ఆ కథను బాలయ్యకు వినిపించగా ఆయన కూడా ఓకే చెప్పారని వెల్లడించారు. చివరగా, “మేమిద్దరం కలిసి సినిమా చేస్తే అది ఇద్దరు చిన్నపిల్లలు చేసినట్టు లేదా ఇద్దరు భోళా శంకర్‌లా చేసినట్టు ఉంటుంది” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

Next Story