- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజాసాబ్ స్టోరీ లీక్ చేసిన డైరెక్టర్.. గట్టిగానే ప్లాన్ చేశాడు కానీ.. పొట్టు పొట్టు వేసుకుంటున్న ఫ్యాన్స్
ప్రభాస్ ‘రాజాసాబ్’ టీజర్ సూపర్ డూపర్ అప్రిసియేషన్ అందుకుంది. రెబల్ స్టార్ ఫస్ట్ టైమ్ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో సినిమా చేస్తుండగా.. ఆయన కామెడీ టైమింగ్‌కు ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఫిదా అయిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్ : ప్రభాస్ ‘రాజాసాబ్’ టీజర్ సూపర్ డూపర్ అప్రిసియేషన్ అందుకుంది. రెబల్ స్టార్ ఫస్ట్ టైమ్ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో సినిమా చేస్తుండగా.. ఆయన కామెడీ టైమింగ్‌కు ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఫిదా అయిపోయారు. వింటేజ్ డార్లింగ్‌ను చూపించారని డైరెక్టర్ మారుతిపై ప్రశంసలు కురిపించారు. కానీ అంతలోపే డైరెక్టర్ స్టోరీ లీక్ చేశాడని ఫైర్ అవుతున్నారు రెబల్స్.
విషయం ఏంటంటే.. రాజాసాబ్ కోసం వేసిన భారీ సెట్స్‌ను చూపించేందుకు మీడియాను పిలిపించారు మేకర్స్. వెహికిల్స్ పెట్టి మరీ జర్నలిస్టులను అక్కడికి తీసుకెళ్లారు. అయితే ఇంత పెద్ద సెట్ వేయడం ఎందుకు వీఎఫ్‌ఎక్స్ వాడొచ్చు కదా అని ఓ జర్నలిస్ట్ డైరెక్టర్‌ను ప్రశ్నించగా.. తాత, నానమ్మ, మనవడు మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా ఇది, వీఎఫ్‌ఎక్స్ కాకుండా ఎమోషన్స్ కనిపించాలి.. అందుకే ఇలా ప్లాన్ చేశామని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టోరీ లీక్ చేయడం వల్ల క్యూరియాసిటీ పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






