రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

by Naga Rani Yarlagadda |

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్, హారర్ థ్రిల్లర్ సినిమా ది రాజాసాబ్.

రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్, హారర్ థ్రిల్లర్ సినిమా ది రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో.. పాన్ ఇండియా హీరో, డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 2026 సంక్రాంతి కానుకగా.. జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. ఇంకా 12 రోజుల్లో సినిమా విడుదల ఉండగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు నిర్వహిస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని సినిమా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. డిసెంబర్ 2.. అంటే ఈరోజు ఖైతలపూర్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు పేర్కొంది.

రాజాసాబ్ సినిమా రన్ టైమ్ ఇటీవలే ఫిక్సయింది. సినిమా నిడివి మూడు గంటలకు పైగా ఉండటంతో సినిమా స్టోరీ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. ఇటీవల వస్తున్న ప్రభాస్ సినిమాలు 3 గంటలకు పైగానే ఉన్నాయి. కానీ.. మారుతి సినిమాల నిడివి సుమారుగా 2 గంటల వరకే ఉంటాయి. వీరిద్దరి సినిమాలతో వస్తోన్న తొలి సినిమా కావడంతో.. భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ ఆకట్టుకున్నాయి. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సంజయ్ దత్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Next Story