Thalaivar 173: 28 ఏళ్ల తర్వాత మళ్లీ అదే కాంబో రిపీట్.. సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్

by Naga Rani Yarlagadda |

విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకం బ్యానర్ పై సుందర్ సి దర్శకత్వంలో #Thalaivar173 సినిమా తెరకెక్కనుంది.

Thalaivar 173: 28 ఏళ్ల తర్వాత మళ్లీ అదే కాంబో రిపీట్.. సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకం బ్యానర్ పై సుందర్ సి దర్శకత్వంలో #Thalaivar173 సినిమా తెరకెక్కనుంది. ఇందుకు సంబంధించి బుధవారం చిత్రబృందం వర్కింగ్ టైటిల్ తో అధికారిక ప్రకటన చేసింది. రజనీకాంత్ - సుందర్ సి కాంబోలో దాదాపు 28 ఏళ్ల తర్వాత మరో సినిమా రాబోతోంది. ఈ సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్లో 1997లో వచ్చిన అరుణాచలం బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ మంచిపేరు సంపాదించుకుంది. ఆ సినిమాలో రజనీకాంత్ డ్యూయల్ రోల్ చేయగా.. మరోసారి హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో సినిమా స్టోరీ ఎలా ఉంటుందోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సినిమాపై కమల్ హాసన్ ట్వీట్ చేయగా.. వెయింట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ -2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Next Story