- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రజనీకాంత్ సినిమాకు పాతికేళ్లు.. రీరిలీజ్ తో ఆ రికార్డు బ్రేక్ చేస్తుందా?
సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. కానీ తమిళంలో “పడయప్ప”గా, తెలుగులో “నరసింహ”గా వచ్చిన ఈ ఒక్క సినిమా మాత్రం ఆయన స్టార్‌డమ్‌కి ఓ భారీ గీటురాయి. 1999లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లోనే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. నరసింహ సినిమాలోని డైలాగులు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటం విశేషం. ఈ సినిమాలో అతిగా ఆశపడిన ఆడది, అతిగా ఆవేశపడిన మగవాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు అనే డైలాగ్.. జీవితసత్యంగా నిలిచిందనడంలో సందేహం లేదు.
ఇప్పుడు ఆ సినిమాకి 25 ఏళ్లు, రజనీకాంత్ సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు కాబోతున్న సందర్భంగా.. ఈ ఐకానిక్ మూవీ డిసెంబర్ 12న, అంటే రజనీ పుట్టినరోజునే గ్రాండ్ రీరిలీజ్‌కి రెడీ అయింది. తమిళనాడులో ఇప్పటికే నరసింహ రీరిలీజ్ పై బజ్ భయంకరంగా ఉంది. థియేటర్లు ఫుల్ బుకింగ్స్‌తో సిద్ధమవుతున్నాయి. అంతేకాదు.. ఓవర్సీస్‌లో కూడా భారీ స్థాయిలో స్క్రీన్లు కన్ఫర్మ్ అయ్యాయి. అమెరికా, మలేషియా, సింగపూర్, గల్ఫ్, ఆస్ట్రేలియా.. ఎక్కడ చోట రజనీ ఫ్యాన్స్ ఈ రీరిలీజ్‌ని సెలబ్రేషన్‌గా మార్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంతకీ ఈ రీరిలీజ్ ఎంత పెద్దగా సెట్ అవుతుందని అందరూ లెక్కలు వేస్తున్నారు.
ఇటీవల విజయ్ పాత సినిమా ‘గిల్లీ’ రీరిలీజ్‌లోనే రూ.30 కోట్లకు పైగా రాబట్టింది. అలాంటిది రజనీకాంత్ లాంటి మాస్, సూపర్ స్టార్ ఐకానిక్ సినిమా, అది కూడా ఆయన పుట్టినరోజు స్పెషల్‌గా వస్తుంటే… ఈసారి రికార్డులు షేక్ అవుతాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కొందరు అయితే బాహుబలి రీరిలీజ్ రికార్డుని కూడా బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. బాహుబలి - ది ఎపిక్ సినిమా రూ.49.8 కోట్లు వసూలు చేసింది. ఏది ఏమైనా.. ఈ ఒక్క సినిమాతోనే రజనీకాంత్ ఎప్పుడూ ఎవరూ టచ్ చేయలేని లెవెల్‌లో ఉన్నాడని మరోసారి నిరూపించుకుంటున్నాడు.






