- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో దోమల బెడదపై రాజమౌళి కొడుకు సెటైరికల్ వీడియో
హైదరాబాద్‌లో దోమల బెడదపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. షూటింగ్ సమయంలో అక్కడ పనిచేస్తున్నవాళ్లు, నటులు దోమలు కుడుతుంటే ఇబ్బంది పడుతున్నట్టు వీడియోలో కనిపిస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో దోమల బెడదపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. షూటింగ్ సమయంలో అక్కడ పనిచేస్తున్నవాళ్లు, నటులు దోమలు కుడుతుంటే ఇబ్బంది పడుతున్నట్టు వీడియోలో కనిపిస్తుంది. తెల్లవారుజామున 2గంటలకు పరిస్థితి అని కార్తికేయ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. దోమల కారణంగా షూటింగ్‌లో చాలా ఇబ్బందిపడినట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా దోమల కారణం సరిగా షూటింగ్ చేసుకోలేక ఇబ్బందిపడినట్టు ఉంది.
వీడియోలో కార్తికేయ, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్‌తో పాటు మరికొందరు ఉన్నారు. ఇక ఇటీవల సైతం హైదరాబాద్ లో దోమలు పెరిగిపోయాయి అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. అంతే కాకుండా దోమలను నిర్మూలించడానికి సరైన పరికరాలు లేవని, నిధులు లేవని అధికారులు చెబుతున్నట్టు వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ కుమారుడు షూటింగ్ తీసుకోలేని పరిస్థితి ఉందని చెబుతూ వీడియోను షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు నెటిజన్లు, హైదరాబాద్ వాసులు నిజంగానే హైదరాబాద్ లో పరిస్థితి ఇలానే ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.






