- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'దేవర'ను వాడుకుంటున్న రాజమౌళి
దేవర చిత్రం కోసం ఏర్పాటు చేసిన భారీ సెట్లో ప్రస్తుతం వారణాసి షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా వారణాసి అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. తాజా షెడ్యూల్ కోసం దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దేవర సినిమాకు రూపొందించిన సెట్స్‌ను వినియోగిస్తున్నట్లు సమాచారం. అది ఎలా అంటే, దేవర చిత్రం సముద్రం నేపథ్యంతో రూపొందడంతో సముద్రం ఎఫెక్ట్ కనిపించేలా ప్రత్యేకంగా భారీ స్విమ్మింగ్ పూల్ తరహా సెట్ను నిర్మించారు.
ప్రస్తుతం వారణాసి చిత్రానికి సంబంధించిన వాటర్ సీక్వెన్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండటంతో, అదే దేవర కోసం నిర్మించిన సెట్లో ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దేవర సెట్లో వారణాసి షూటింగ్ జరుగుతోంది అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్‌ను ఒకేసారి పూర్తి చేసి, మొదటి భాగం విడుదలైన కొద్ది రోజుల వ్యవధిలోనే రెండో భాగాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.






