బాహుబలి, మగధీర కాదు అదే నా బెస్ట్ సినిమా: రాజమౌళి

by Ajay Maddhiboyina |

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి నేడు జూనియ‌ర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో యాంక‌ర్ జ‌క్క‌న్న సినిమాల పోస్ట‌ర్ ల‌ను చూపిస్తూ ఈ సినిమాలో మీరు మ‌ర్చిపోలేని మెమోరీ ఏంటి అని ప్ర‌శ్నించ‌గా

బాహుబలి, మగధీర కాదు అదే నా బెస్ట్ సినిమా: రాజమౌళి
X

దిశ‌, వెబ్ డెస్క్: ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి నేడు జూనియ‌ర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో యాంక‌ర్ జ‌క్క‌న్న సినిమాల పోస్ట‌ర్ ల‌ను చూపిస్తూ ఈ సినిమాలో మీరు మ‌ర్చిపోలేని మెమోరీ ఏంటి అని ప్ర‌శ్నించ‌గా ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇచ్చారు. మ‌గ‌ధీర సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఫైట్ మాస్ట‌ర్ పీట‌ర్ కింద‌ప‌డ్డాడ‌ని, అది బాధ‌క‌ర‌మైన విష‌యం దాన్ని మ‌ర్చిపోలేనన్నారు.

స్టూడెంట్ నంబ‌ర్ 1 సినిమా పోస్ట‌ర్ చూస్తే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో తార‌క్ తో క‌లిసి స్టూడెంట్ నంబ‌ర్ 1 రీక్రియేష‌న్ ఫోటో తీసుకున్నామని అదే గుర్తుకు వ‌స్తుంద‌ని చెప్పారు. ఈగ సినిమా పోస్ట‌ర్ చూస్తే ఇది నా బెస్ట్ ఫిల్మ్ అని అన్నారు. గ‌తంలోనూ జ‌క్క‌న్న చాలా సార్లు త‌న ఫేవ‌రెట్ సినిమా ఈగ అని చెప్పిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా సై సినిమాలో ర‌బ్బీ అనే ఒక కొత్త ఆట‌ను తీసుకువ‌చ్చామ‌ని అది జ‌నాల‌కు భాగా క‌నెక్ట్ అయ్యింద‌న్నారు.

Next Story