- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మహాభారతం’పై BIG అప్డేట్ ఇచ్చిన రాజమౌళి.. ఆ హీరో కన్ఫామ్
తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం(Mahabharatham)పై దర్శకధీరుడు SS రాజమౌళి(Rajamouli) బిగ్ అప్డేట్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం(Mahabharatham)పై దర్శకధీరుడు SS రాజమౌళి(Rajamouli) బిగ్ అప్డేట్ ఇచ్చారు. నాచురల్ స్టార్ నాని - శైలేశ్ కొలను కాంబినేషన్‌లో వస్తోన్న HIT- 3 సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు SS రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాభారతం అప్డేట్ ఇవ్వాలని యాంకర్ సుమ రాజమౌళిని రిక్వెస్ట్ చేసింది. మహాభారతంలో నాని ఉంటాడా? అని ప్రశ్నించింది. దానికి రాజమౌళి స్పందిస్తూ.. నానికి మంచి క్యారెక్టర్ ఉంది.. తప్పకుండా మహాభారతంలో నాని ఉంటాడని కన్ఫామ్ చేశారు. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక హిట్ -3 సినిమా విషయానికి వస్తే.. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్‌లో నాని అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నాడు. నాని సరసన కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాథ్, అదిల్ పాలా, సూర్య శ్రీనివాస్ తదితరలు నటించారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన టీజర్స్, ట్రైలర్ చూస్తే సినిమాలో ఫుల్ వయోలెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మేడే కానుకగా మే 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
“మహాభారతంలో నాని పక్క ఉంటాడు” - #SSRajamouli
— Telugu FilmNagar (@telugufilmnagar) April 27, 2025
And he remains silent about #SSMB29 update.#Nani #HIT3 #TeluguFilmNagar pic.twitter.com/Ue49OgOfNx






