నాకు రాముడు అంటే ఇష్టం లేదు.. రాజమౌళి పాత ట్వీట్ వైరల్

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి సినిమాల‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్పటి వ‌ర‌కు ఆయ‌న కెరీర్ లో ఒక్క ఫ్లాప్ సినిమా లేదంటే జ‌క్క‌న్న టాలెంట్ అర్థం చేసుకోవ‌చ్చు. అంతే కాకుండా సినిమాల ప‌రంగా జ‌క్క‌న్న‌పై ఎలాంటి కాంట్ర‌వ‌ర్సీలు ఉండ‌వు.

నాకు రాముడు అంటే ఇష్టం లేదు.. రాజమౌళి పాత ట్వీట్ వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి సినిమాల‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్పటి వ‌ర‌కు ఆయ‌న కెరీర్ లో ఒక్క ఫ్లాప్ సినిమా లేదంటే జ‌క్క‌న్న టాలెంట్ అర్థం చేసుకోవ‌చ్చు. అంతే కాకుండా సినిమాల ప‌రంగా జ‌క్క‌న్న‌పై ఎలాంటి కాంట్ర‌వ‌ర్సీలు ఉండ‌వు. ఎప్పుడూ కూల్ గా కనిపిస్తూ సంవ‌త్స‌రాల పాటు ఒకే సినిమా తీయ‌డంతో ఫుల్ బిజీగా ఉంటారు. అయితే ఇప్పుడు ఆయ‌న ఓ కాంట్ర‌వ‌ర్సీలో చిక్కుకున్నారు. మ‌హేశ్ బాబు హీరోగా న‌టిస్తున్న వార‌ణాసి సినిమా గ్లోబ్ ట్రూట‌ర్ ఈవెంట్ లో జ‌క్క‌న్న త‌న‌కు దేవుడు అంటే న‌మ్మ‌కం లేద‌ని అన్నారు.

సినిమాను హ‌నుమాన్ చూసుకుంటాడు అని త‌న తండ్రి అన్న‌ప్పుడు త‌న‌కు కోపం వ‌చ్చింద‌న్నారు. దీంతో ఆయ‌న‌పై కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌గా ఇప్పుడు ఆయ‌న గ‌తంలో చేసిన ట్వీట్ ను సైతం వైర‌ల్ చేస్తున్నారు. 2011లో ఓ అభిమాని రాజ‌మౌళికి ఎక్స్ వేధికగా శ్రీరామ‌న‌వమి శుభాకాంక్ష‌లు చెప్పాడు. దానికి రాజ‌మౌళి.. థాంక్యూ కానీ నాకు రాముడు అంటే ఎప్పుడూ ఇష్టంలేదు. అన్ని అవ‌తారాల్లో కృష్ణుడు అంటేనే ఇష్టం అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో మ‌రి రాముడి పేరుతో సినిమాలు చేస్తూ ఎందుకు డ‌బ్బు సంపాదించుకుంటున్నావ్ అంటూ నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు.

Next Story