- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రాజా సాబ్’ నుంచి ఫుల్ వీడియో సాంగ్
రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘రాజా సాబ్’. హారర్ కామెడీ జానర్‌లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్

దిశ, సినిమా : రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘రాజా సాబ్’. హారర్ కామెడీ జానర్‌లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా సెకండ్ సింగిల్ ‘సహన సహన..’ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మాట్లాడిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్..‘‘రాజా సాబ్’లో సాంగ్స్ సూపర్బ్‌గా వచ్చాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పుడు బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ సహన సహన మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇంకా రెండు సాంగ్స్ కూడా అదిరిపోతాయి. ముగ్గురు హీరోయిన్స్ కాంబినేషన్‌లో ప్రభాస్ చేసిన సాంగ్, ఆ పాటలో ఆయన చేసిన డ్యాన్సులు అదిరిపోతాయి. జనవరి 8న ప్రీమియర్స్‌లో కలుద్దాం. మా మూవీకి మీ సపోర్ట్ ఇలాగే అందిస్తూ ఉండండి’ అన్నారు. కార్యక్రమానికి హీరోయిన్ నిధి అగర్వాల్, డైరెక్టర్ మారుతి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, హీరోయిన్ రిద్ది కుమార్ తదితరులు హాజరయ్యారు.






