- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మంత్రి నారాయణ’గా రాజా రవీంద్ర
వరుణ్ సందేశ్, గగన్, రాజేశ్, రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘కాస్ట్’ నుంచి నటుడు రాజా వరీంద్ర ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.

దిశ, సినిమా: వరుణ్ సందేశ్, గగన్, రాజేశ్, రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘కాస్ట్’. ఎకె. జంపన్న రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగబాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్న మేకర్స్ తెలిపుతూ రిలీజ్ చేసిన పోస్టర్‌కు మంచి స్పందన లభించగా.. తాజాగా మరో క్యారెక్టర్‌ను రివీల్ చేశారు చిత్ర బృందం. ప్రముఖ నటుడు రాజా రవీంద్ర ఇందులో మినిస్టర్ నారాయణ పాత్రలో కనిపంచనున్నట్లు చెబుతూ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. తెల్లటి దుస్తులు, భుజంపై పార్టీ కండువా ధరించిన రాజా రవీంద్ర సీజన్డ్ పొలిటీషియన్ మాదిరి కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్‌కు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన లభించింది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు మేకర్స్. కాగా.. ఈ మూవీలో కశికా కపూర్, దివి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.






