- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gods and Soldiers: గోలీసోడా ఫ్రాంచైజీలో మూడో భాగం.. టైటిల్ ఏంటంటే?
‘గోలీసోడా’, ‘గోలీసోడా-2’ చిత్రాలతో హిట్ అందుకున్న డైరెక్టర్, ప్రముఖ కెమెరామెన్ విజయ్ మిల్టన్.. ఇప్పుడు గోలీసోడా ఫ్రాంచైజీలో మూడో భాగాన్ని తెరకెక్కించేందుకు సిద్ధం అయ్యాడు.

దిశ, సినిమా: ‘గోలీసోడా’, ‘గోలీసోడా-2’ చిత్రాలతో హిట్ అందుకున్న డైరెక్టర్, ప్రముఖ కెమెరామెన్ విజయ్ మిల్టన్.. ఇప్పుడు గోలీసోడా ఫ్రాంచైజీలో మూడో భాగాన్ని తెరకెక్కించేందుకు సిద్ధం అయ్యాడు. టాలవుడ్ నటుడు రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్నది. రాజ్ తరుణ్ ఈ చిత్రంతో తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. సునీల్, వేదన్, భారత్, అమ్ము అభిరామి, కిషోర్, జెఫ్రీరి, భరత్ శ్రీని, పాల డబ్బా, విజిత తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘గాడ్స్ అండ్ సోల్జర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తమిళ స్టార్స్ విజయ్ సేతుపతి, విజయ్ ఆంటోని, ఆర్యలతో పాటు తెలుగు హీరో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ తమ ఎక్స్ అకౌంట్స్ వేదికగా టైటిల్ పోస్టర్‌ను రివీల్ చేస్తూ పోస్టర్ షేర్ చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ విజయ్ మిల్టన్ మాట్లాడుతూ.. ‘గోలీసోడాలోని రఫ్‌నెస్‌తో పాటు న్యూ చాప్టర్‌లో ఈ సినిమాలో ఆడియన్స్ చూడబోతున్నారు. ‘గాడ్స్ అండ్ సోల్జర్’ టైటిల్ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. అలాగే సినిమాపై ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. తప్పకుండా మా చిత్రం తెలుగు, తమిళ భాషల్లో అందరి అంచనాలను అందుకుంటుంది. మా టైటిల్ టీజర్‌ను తమ సోషల్ మీడియాలో షేర్ చేసి మా టీమ్‌ను సపోర్ట్ చేసిన అందరికి ధన్యవాదాలు’ అని తెలిపారు.






