రాజ్ తరుణ్ కోలీవుడ్ ఎంట్రీ ఫిక్స్.. గోలీ సోడా రీలోడింగ్ అంటూ అధికారిక ప్రకటన విడుదల

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-11 08:05:20  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun) గత ఏడాది ‘నా సామిరంగ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అదే ఫామ్‌తో వరుస మూవీస్ చేస్తున్నాడు.

రాజ్ తరుణ్ కోలీవుడ్ ఎంట్రీ ఫిక్స్.. గోలీ సోడా  రీలోడింగ్ అంటూ అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun) గత ఏడాది ‘నా సామిరంగ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అదే ఫామ్‌తో వరుస మూవీస్ చేస్తున్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’(Panch Minar) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రామ్ కుడుముల(Ram Kudumula) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో రాశిసింగ్(Rashi Singh) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీని కనెక్ట్ మూవీస్ బ్యానర్‌పై మాధవి, ఎంఎస్ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేRashi Singhగంగా జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, రాజ్ తరుణ్ నటిస్తున్న ఓ కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ చిత్రంతోనే ఆయన కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించారు. అయితే యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ మూవీ 5వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ఇక హీరో, డైరెక్టర్ ఫొటో షేర్ చేస్తూ.. ‘‘గోలి సోడా వారసత్వం మళ్లీ లోడ్ అవుతోంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఇక రాజ్ తరుణ్ తెలుగు ఇండస్ట్రీలోని చిక్కుల వల్లనే కోలీవుడ్‌కి వెళ్తున్నట్లు నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. కాగా, రాజ్ గత కొద్ది రోజుల నుంచి చిక్కుల్లో పడ్డారు. ఆయన లావణ్య అనే అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడని ఆమె కేసు పెట్టడంతో అంతా షాక్ అయ్యారు. నిత్యం ఆమె రాజ్ తరుణ్‌పై పలు ఆరోపణలు చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఇక ఆయన ఇల్లు కూడా ఆమె తీసుకున్నట్లు ఆయన తల్లిదండ్రులు గొడవకు దిగారు. మా ఇల్లు మాకు కావాలని ఇంటి ముందు ధర్నా మొదలెట్టారు.

Next Story