Lavanya: నాపై రివేంజ్ తీర్చుకోవడం కోసమే ఆ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.. మరోసారి హాట్ టాపిక్‌గా లావణ్య కామెంట్స్

by Chukka Sudharani |

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూ ఎంత హాట్ టాపిక్‌గా మారిందో అందరికి తెలిసిందే.

Lavanya: నాపై రివేంజ్ తీర్చుకోవడం కోసమే ఆ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.. మరోసారి హాట్ టాపిక్‌గా లావణ్య కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూ ఎంత హాట్ టాపిక్‌గా మారిందో అందరికి తెలిసిందే. ఏడేళ్లుగా రిలేషన్‌లో ఉన్న నన్ను ఇప్పుడు రాజ్ వదిలేశాడంటూ లావణ్య హీరో రాజ్ తరుణ్‌పై కేసుల మీద కేసులు పెట్టింది. అలాగే వాటికి సంబంధించిన ఆడియో రికార్డులు, వీడియోలు కూడా బయట పెట్టింది. ఇక ఆ తర్వాత నన్ను కావాలనే రెచ్చగొట్టి మస్తాన్ సాయి అనే వ్యక్తి.. రాజ్‌పై కేసులు పెట్టించాడంటూ మరోసారి మీడియా ముందుకు వచ్చి హల్‌చల్ చేసింది. అలాగే రీసెంట్‌గా.. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య ఉంటున్న ఇంటిని లాక్కోవడానికి వచ్చారంటూ మరో ఇష్యూ జరిగిన విషయం తెలిసిందే. ఇలా రెండేళ్ల నుంచి మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన లావణ్య మరోసారి మీడియా ముందుకు వచ్చింది.

ఈ మేరకు.. సెల్ఫ్ వీడియోలో మాట్లాడుతూ.. ‘నావి కొన్ని ఆడియోస్ అండ్ వీడియోస్ వైరల్ అవ్వడం జరుగుతోంది. గతంలో నేను మస్తాన్ సాయి పైనా అదే హార్డ్ డిస్క్ గురించి కంప్లైంట్ పెట్టడం జరిగింది. అదే హార్డ్ డిస్క్‌లో ఉన్న ఆడియోస్, వీడియోస్ ఇప్పుడు కుట్ర పూర్వకంగా, ఉద్దేశ పూర్వకంగా నాపై రివేంజ్ తీర్చుకునే ప్లాన్ ప్రకారం మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. నేను బాగానే ఉన్నాను.. ఇప్పుడు ఎలాంటి ఇష్యూస్‌లో జోక్యం చేసుకోవడం లేదు. నాకు సంబంధం లేదు. కేవలం ఉద్దేశపూర్వకంగా మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలు వైరల్ చేస్తున్నారు. దయచేసి వాటిని ఎవరూ నమ్మకండి. వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం లావణ్య కామంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story