- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంతో ధైర్యం ఉంటేగాని ఇలా చేయరు.. వైరల్‌గా రాజ్ తరుణ్ కామెంట్స్
యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘పాంచ్ మినార్’.

దిశ, సినిమా: యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘పాంచ్ మినార్’. రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ‘మా పాంచ్ మినార్’ ట్రైలర్ రిలీజ్ చేశాం.
కొంచెం ఓపెన్ మైండ్‌తో చూడమని కోరుకుంటున్నా. చాలా మంచి ఎంటర్‌టైన్మెంట్ ఇది. అందరూ థియేటర్స్‌కి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్లే సినిమా. మా సినిమా నవంబర్ 21న థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ప్రీమియర్స్ వేశాము.. చూసిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. 19, 20 తేదీల్లో కూడా మళ్లీ ప్రీమియర్స్ వేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఎంతో ధైర్యం ఉంటే గాని ఇలా చేయరు. సినిమాని ఆడియన్స్ అందరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యామిలీ అందరూ థియేటర్స్ వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.






