SHHYAMALI: సమంతతో వివాహం.. రాజ్ మొదటి భార్య సంచలన ప్రకటన

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత డిసెంబర్ 1న రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కోయంబత్తూర్ లోని ఈషా ఆశ్రమంలో సమంత రాజ్ వివాహం చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు.

SHHYAMALI: సమంతతో వివాహం.. రాజ్ మొదటి భార్య సంచలన ప్రకటన
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత డిసెంబర్ 1న రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కోయంబత్తూర్ లోని ఈషా ఆశ్రమంలో సమంత రాజ్ వివాహం చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. ఇది సమంతకు రెండో పెళ్లి అన్న సంగతి తెలిసిందే. సమంత మొదట నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకోగా వీరిద్దరూ తరవాత విడాకులు తీసుకున్నారు. ఏం జరిగిందో కానీ ఈ జంట 2021లో విడాకులను ప్రకటించింది.

అయితే సమంతకు మాత్రమే కాకుండా రాజ్ కు కూడా ఇది రెండో వివాహమే. రాజ్ నిడిమోరు మొదట శ్యామాలీ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒకరు సంతానం కాగా వీరిద్దరూ కూడా విడిపోయారు. ఇక రాజ్ సమంత డేటింగ్ వార్తలు వచ్చిన నాటి నుండి శ్యామిలీ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె ఇన్ స్టాలో సంచలన ప్రకటన చేశారు. "నా పై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు అందరికీ కృత‌జ్ఞ‌త‌లు.

మీ ఆశీర్వాదాలు నాకు అందుతున్నాయి. కానీ నేను ఉన్న ప‌రిస్థితుల్లో ఎలాంటి విష‌యాల‌ను ప‌ట్టించుకోలేను. మా గురువుగారికి క్యాన్స‌ర్ వ‌చ్చిన‌ట్టు తెలిసింది. ఆ వార్తతో నాకు రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌డంలేదు. ఆయ‌న ఆరోగ్యం గురించే ప్రార్థిస్తున్నాను. కాబట్టి అంద‌రి మెసేజ్ ల‌కు స్పందించ‌లేను. నా నుండి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ లు ఆశించ‌కండి. మీడియా నాపై సానుభూతి చూపించాల్సిన అవ‌స‌రం లేదు. అంద‌రూ సంతోషంగా ఉండాల‌నే నేనెప్పుడూ కోరుకుంటాను". అని శ్యామిలీ త‌న పోస్టులో పేర్కొన్నారు.

Next Story