క్రేజీ ఛాన్స్ కొట్టేసిన రాయ్ లక్ష్మి?

by Pulgam srinivas |

బాలకృష్ణ సినిమాలో 'రాయ్ లక్ష్మి'కి ఛాన్స్.

క్రేజీ ఛాన్స్ కొట్టేసిన రాయ్ లక్ష్మి?
X

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు వరుస తెలుగు సినిమాలతో చాలా బిజీగా కెరీర్‌ను కొనసాగించిన రాయ్ లక్ష్మి ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలు చేయడం లేదు. అయితే తాజాగా ఈమెకు ఓ భారీ చిత్రంలో ఆఫర్ వచ్చినట్లు టాలీవుడ్ సర్కిల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని 'NBK 111' అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభించారు.

ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే మెయిన్ హీరోయిన్‌గా నయనతారను మేకర్స్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రెండవ హీరోయిన్‌గా 'రాయ్ లక్ష్మి'ని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన అధినాయకుడు చిత్రంలో ఈ నటి బాలకృష్ణతో కలిసి నటించింది.

ఆ తర్వాత చాలా ఏళ్లకు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఈ బ్యూటీని కేవలం గ్లామర్ షో కోసం కాకుండా, ఒక అద్భుతమైన పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన వీరసింహారెడ్డి చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో, వీరి కాంబోలో వస్తున్న రెండో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Next Story