Rahul Sipligunj: ‘క్యాప్షన్ లేదు యాక్షన్ మాత్రమే’.. జిమ్‌లో రాహుల్ సిప్లిగుంజ్ కష్టాలు

by Kodari Anjali |

ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Rahul Sipligunj: ‘క్యాప్షన్ లేదు యాక్షన్ మాత్రమే’.. జిమ్‌లో రాహుల్ సిప్లిగుంజ్ కష్టాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ యూట్యూబ్ ద్వారా ఫేమ్ దక్కించుకున్న ఈ సింగర్ జోష్ మూవీలోని కాలేజ్ బుల్లోడ సాంగ్ తో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి పాడిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్‌కు ఏకంగా ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది.

చిన్నప్పటి నుంచి పాటలపై ఉన్న ఇష్టంతోనే సింగర్ అయ్యాయని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు రాహుల్. వంటగదిలోని వస్తువులతో సంగీతాన్ని వాయిస్తూ సాంగ్స్ పాడటం గమనించిన తండ్రి.. పండిత్ విఠల్ రావు దగ్గరికి పంపించి సంగీతాన్ని నేర్పించారట. ఇక తర్వాత రాహుల్ కెరీరే మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. పిల్లాహేయ్ పిల్లా, ఎందుకో, ఏం మాయలో, జై బోలో ఎల్లమ్మ తల్లికి, గల్లీకా గణేష్, మంగమ్మ, ఏనది, మైసమ్మ, పూర్ బాయ్, మగజాతి, పొయినవా, దుమారే, మాక్కికిరికిరీ, దావత్ వంటి చిత్రాలకు మ్యూజిక్ అందించాడు.

రంగస్థలం, దమ్ము, కెమెరామెన్ గంగతో రాంబాబు, రచ్చ, గ్యాంగ్, చల్ మోహన రంగా, మల్లేశం, రామ చక్కని సీత, చావు బురు చల్లగా, రంగమార్తాండ, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, గ్యాంగ్, లై వంటి చిత్రాల్లో పలు సాంగ్స్‌ పాడాడు. అయితే తాజాగా రాహుల్ సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టారు. జిమ్ లో చెమటలు చిందిస్తోన్న ఓ వీడియో పంచుకున్నాడు. ఈ వీడియోకు ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ‘క్యాప్షన్ లేదు యాక్షన్ మాత్రమే’ అని జోడించాడు. ప్రస్తుతం రాహుల్ సిప్లిగుంజ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story