పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు రాహుల్ సిప్లిగంజ్ సర్‌ప్రైజ్ (వీడియో)

by Gantepaka Srikanth |

టాలీవుడ్(Tollywood) మ్యూజిక్ లవర్స్‌కు స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌(Rahul Sipliganj ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు రాహుల్ సిప్లిగంజ్ సర్‌ప్రైజ్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్(Tollywood) మ్యూజిక్ లవర్స్‌కు స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌(Rahul Sipliganj ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటతో ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ప్రతిష్టాత్మక ఆస్కార్ స్టేజీపైన లైవ్ పెర్ఫామెన్స్ చేసి సత్తా చాటారు. తాజాగా.. ఆయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. హరిహర వీరమల్లు సినిమాలోని కొల్లగొట్టినాదిరో పాట పాడుతూ వీడియో విడుదల చేశారు. వచ్చే నెల మార్చి 22 ఆస్కార్ విజేత MM కీరవాణి హైదరాబాద్‌లో మై టూర్ MMK పేరుతో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ చేయబోతున్నారు. ఈ కన్సర్ట్‌లో రాహుల్ సిప్లిగంజ్ పాల్గొనబోతున్నారు.

ఈ క్రమంలోనే హరిహర వీరమల్లులోని కొల్లగొట్టినాదిరో పాటతో లైవ్ కన్సర్ట్‌ను అదరగొడుదాం.. అందరూ రండి అని రాహుల్ సిప్లిగంజ్ వీడియో విడుదల చేశారు. మరోవైపు.. హరిహర వీరమల్లు సినిమా(HHVM Movie)లోని కొల్లగొట్టినాదిరో సాంగ్ యూట్యూబ్‌తో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అదరగొడుతోంది. ఈ పాటకు ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన రీల్స్ వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. జ్యోతికృష్ణ-క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. వచ్చే మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు.

Next Story