- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Raghavendra Rao: 20 ఏళ్ల క్రితం శ్రీలీల వాళ్ళ అమ్మని చూసుంటే హీరోయిన్‌ని చేసేవాడిని
రాఘవేంద్రరావు తాజాగా మాట్లాడుతూ... 20 ఏళ్ల క్రితం శ్రీలీల అమ్మగారిని చూసి ఉంటే నా సినిమాలో హీరోయిన్గా పెట్టుకునేవాడినని కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా అనేక సంవత్సరాలు కెరీర్ను కొనసాగించిన వారిలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఒకరు. ఈయన ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కించి ఎన్నో సంవత్సరాల పాటు తిరుగులేని దర్శకుడిగా కెరీర్ను కొనసాగించాడు. ఈ మధ్యకాలంలో ఈయన సినిమాలకు పెద్దగా దర్శకత్వం వహించడం లేదు, కానీ కొంత కాలం క్రితం శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా రూపొందిన పెళ్లి సందD అనే చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు, అలాగే ఇందులో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.
ఈ చిత్రంతోనే శ్రీలీల టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం, ఇందులో ఈమె తన డాన్స్, అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ చిత్రం ద్వారా ఈ బ్యూటీకి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఈ నటి ఆ తర్వాత వరుస పెట్టి ఎన్నో సినిమాలలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి దశలో కెరీర్ను ముందుకు సాగిస్తోంది. తాజాగా రాఘవేంద్రరావు, శ్రీలీల ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్నారు. అందులో భాగంగా శ్రీలీల, తల్లి గురించి రాఘవేంద్రరావు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు, ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
రాఘవేంద్రరావు స్టేజీపై నిలబడి మాట్లాడుతున్న సమయంలో ఆయన పక్కనే శ్రీలీల కూడా ఉంది. ఆ సమయంలో స్టేజ్ కింద కుర్చీలో శ్రీలీల తల్లి కూర్చొని ఉంది. ఆ సమయంలో రాఘవేంద్రరావు "20 ఏళ్ల క్రితం శ్రీలీల అమ్మగారిని చూసుంటే నా సినిమాలో హీరోయిన్గా పెట్టుకునే వాడిని. ఆమె కొంచెం వైజయంతి మాల లాగా ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు. తాజాగా రాఘవేందర్రావు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.






