Raghava Lawrence: ఇది చదివినప్పుడు నా గుండె తరుక్కుపోయింది.. రాఘవ లారెన్స్ ఎమోషనల్ ట్వీట్

by Chukka Sudharani |

డాన్స్ మాస్టర్, స్టార్ హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు.

Raghava Lawrence: ఇది చదివినప్పుడు నా గుండె తరుక్కుపోయింది.. రాఘవ లారెన్స్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: డాన్స్ మాస్టర్, స్టార్ హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. అలాగే ఈయన సేవా కార్యక్రమాల్లో తనదైన శైలిలో పాల్గొంటూ.. పేదలకు సహాయం అందిస్తుంటారు. లారెన్స్ గొప్ప మనసు గురించి కూడా ప్రత్యేకంగా అందరికి చెప్పాల్సిన పని లేదు. అనాధ పిల్లలకు, ఎంతో మంది అభాగ్యులకు పలు సేవా కార్యక్రమాలు, ఛారిటబుల్ ట్రస్ట్‌(Charitable Trust)ల ద్వారా తనను చేతనైనా సాయం అందిస్తూ ప్రజలలో నిజమైన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఎవరికైనా సాయం అని కోరుకోగానే ముందుండే రాఘవ లారెన్స్.. తాజాగా ఓ లక్ష రూపాయలు విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు.

అసలు ఏం జరిగిందంటే.. ‘శివగంగై జిల్లా తిరుప్పువనం సమీపంలోని క్లాధారి గ్రామానికి చెందిన ముత్తు కరుప్పు (30) తన కూలిపనుల ద్వారా వచ్చిన డబ్బును 500 రూపాయలుగా మార్చుకుని 1 లక్ష రూపాయలను భద్రపరిచేందుకు టిన్ కాయిన్‌లో ఉంచి ఇంటిలోని మట్టిలో పాతిపెట్టాడు. అయితే.. తన కూతురి చెవిపోగు వేడుక కోసం దాచిపెట్టిన డబ్బును బయటకు తీయగా.. చెదపురుగులు మొత్తం డబ్బును మాయం చేశాయి’ అని కుటుంబం బాధ పడుతున్న ఓ ఫొటోను.. ఓ వ్యక్తి షేర్ చేస్తూ ఈ ఫ్యామిలీకి సహాయం చేయండి అంటూ రాఘవ లారెన్స్‌ను ట్యాగ్ చేశాడు. దీనిపై స్పందించిన లారెన్స్.. ‘హాయ్ బ్రదర్, నేను ఇప్పుడే ఈ పోస్ట్ చూశాను. చదివినప్పుడు నా గుండె తరుక్కుపోయింది. నేను వారి కోసం 1 లక్ష విరాళం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి సంప్రదింపు సమాచారాన్ని పంచుకోండి. నన్ను ట్యాగ్ చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు. లారెన్స్ పోస్ట్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

Next Story